భారతదేశం, ఆగస్టు 12 -- ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజా పరిణామాల నేపథ్యంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం కార్యదర్శి రవిగుప్తా సహా సినీ నిర్మాతలతో కలిసి మంత్రితో సమావేశమయ్యారు దిల్ రాజు.

తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. ''నైపుణ్యం లేని కార్మికులకు చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న కనీస వేతనాల కంటే చాలా ఎక్కువ చెల్లిస్తున్నాం. ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న సినిమాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. దశాబ్దాలుగా తమ సభ్యులతో కలిసి పనిచేస్తున్న ఫెడరేషన్ తీసుకున్న ఈ చర్యను చా...