భారతదేశం, జనవరి 4 -- డిసెంబర్ వరకు చలి తీవ్రతతో ప్రజలంతా గజగజ వణికిపోయారు. ఉదయం, రాత్రి వేళలో బయటికి వెళ్లలేని పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా పొగమంచు పరిస్థితులతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వృద్ధులు చాలా ఇబ్బందిపడ్డారు. అయితే గడిచిన నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పులు ఉన్నాయి. చలి తీవ్రత క్రమంగా తగ్గిపోయిన పరిస్థితులు కనిపించాయి. హైదరాబాద్ శివారు, ఏజెన్సీ ప్రాంతాలు మినహాయిస్తే చాలా ఏరియాల్లో చలి తీవ్రత తగ్గింది.

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం. రాష్ట్రంలో మళ్లీ చలి పెరిగే అవకాశం ఉంది. ఈనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మళ్లీ చలి గాలుల తీవ్రత ఉంటుంది. పొగమంచు పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పడిపోతాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... రాబోయే రోజుల్లో తెలంగాణలో అక్కడకక్కడ పొగమంచు కు...