భారతదేశం, సెప్టెంబర్ 12 -- అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వాషింగ్ మెషిన్ విషయంలో జరిగిన చిన్నపాటి గొడవ ఓ భారత సంతతి వ్యక్తి ప్రాణాలను తీసింది! డల్లాస్ నగరంలోని ఒక హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్న చంద్ర మౌళి బాబ్ నాగమల్లయ్య (50).. ఆయన భార్య, కుమారుడి కళ్ల ముందే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు పాల్పడిన సహోద్యోగిని పోలీసులు అరెస్టు చేసి, అతనిపై మర్డర్ కేసు నమోదు చేశారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన చంద్ర మౌళి బాబ్ నాగమల్లయ్య డల్లాస్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

డల్లాస్​ పోలీసుల ప్రకారం.. కబోస్​ మార్టినేజ్​ అనే 37ఏళ్ల వ్యక్తి సైతం అదే హోటల్​లో పని చేస్తున్నాడు. సరిగ్గా పనిచేయని ఒక వాషింగ్​ మెషిన్​ విషయంలో వీరిద్దరి మధ్య స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం గొడవ మొదలైంది...