భారతదేశం, మే 27 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా గ్రహాల సేనాధిపతిగా పిలిచే అంగారకుడు (కుజుడు) రాశి మారినప్పుడు దేశ విదేశాలతో పాటు మానవ జీవితంపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ధైర్యం, శక్తి, భూమి, ఆత్మవిశ్వాసానికి కారకుడైన కుజుడు.. జూన్ నెలలో తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు.

ఈసారి శుక్రుడికి చెందిన వృషభ రాశిలోకి అంగారకుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారం వల్ల ధన సంపద పెరగడమే కాకుండా కెరీర్‌లో ఊహించని ఎదుగుదల కనిపిస్తుంది.

ప్రస్తుతం మేష రాశిలో ఉన్న కుజుడు, జూన్ 21, 2026న వృషభ రాశిలోకి అడుగుపెడతాడు. ఆగస్టు 2, 2026 వరకు అంటే దాదాపు 40 రోజుల పాటు ఇదే రాశిలో ఉంటాడు. దీనివల్ల ఏ రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారో ఇప్పుడ...