Hyderabad, అక్టోబర్ 6 -- ఈరోజు శారదయ పౌర్ణమి లేదా శరత్ పూర్ణిమ. ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సంతోషంగా ఉండవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్లయితే డబ్బుకి లోటు ఉండదు, ఏ ఆర్థిక ఇబ్బంది ఉండదు.

శారదయ పూర్ణిమ చాలా విశేషమైన రోజు. చంద్రుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. దీపావళి కంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈ రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే మంచిది. అయితే ఈ రోజు కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది కూడా. ఈ రాశుల వారు లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద, సంతోషాన్ని పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడే తెలుసుకుందాం.

శారదయ పౌర్ణమి నాడు పూజలు, మంత్రాలను జపించడం వంటి వాటిని ఫాలో అయితే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ప్రత్యేక ఫలితాలను పొందవచ్చు. ఈరోజు పౌర్ణమి వేళ చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. రెండున్నర రోజు...