భారతదేశం, జూలై 22 -- తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. తొలి ఏకాదశి నాడు చేసే పూజకు, ఉపవాసానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే తొలి ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తొలి ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఆ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అయితే తొలి ఏకాదశి నాడు విష్ణువును ఎలా ఆరాధించాలి? పూజా విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానం చేయాలి. శుభ్రమైన, పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముగ్గు వేయాలి.

ఆ తర్వాత విష్ణుమూర్తి ఎదుట దీపం వెలిగించి, పూలు, తులసి దళాలను సమర్పించాలి. "తొలి ఏకాదశి వ్రతాన్ని...