భారతదేశం, జూన్ 8 -- విశాఖ ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant) లో సోమవారం అత్యంత ఘోరమైన ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని స్టీల్ మెల్టింగ్ షాప్-2 (SMS-2) విభాగంలో ఉన్న ఎస్‌టీసీ-3 (STC-3) హీట్ ఎఫ్‌జీ వద్ద భారీ మొత్తంలో ద్రవరూపంలో ఉన్న ఉక్కు (Hot Liquid Steel) లీకవడంతో ఈ విపత్తు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో భారీ క్రేన్ సహాయంతో కరిగిన ఉక్కు ద్రవాన్ని పైకి లిఫ్ట్ చేస్తుండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన ఉక్కుద్రవం ఒక్కసారిగా కిందకు లీకైంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న ఉక్కు ద్రవం కింద పడటంతో ఆ ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో మంటలు చెలరేగాయి. అక్కడ విధుల్లో ...