భారతదేశం, మార్చి 18 -- విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడింది. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టుగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా ఈ మేరకు సమాధానం చెప్పారు. జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని వెల్లడించారు.

'జోన్ ప్రధాన కార్యాలయ భవనం పునాది పనులు పూర్తయ్యాయి. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌కు రూ.2047 కోట్లు మంజూరు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో రూ.70232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి.' అని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. 2024లో విశాఖపట్నంలోని ముడసర్లోవ దగ్గర 52.2 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైల్వే శాఖకు అప్పగించిందని గుర్తు చేశారు.

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కేంద్రం రూ.106.89 కోట్లు...