భారతదేశం, జూన్ 14 -- పర్యాటక రంగంలో, పారిశ్రామికంగా ఎంతో వేగంగా దూసుకుపోతున్న విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా వ్యవస్థలో త్వరలోనే ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక వసతులు కల్పించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) విశాఖ జిల్లాలో 100 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించింది.

ఈ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా అందించే తొలి సర్వీసులను ముఖ్యంగా భోగాపురం అల్లురి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి (Bhogapuram Airport) అనుసంధానం చేయనున్నారు. జూలై మొదటి వారంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆర్టీసీ ఈ ముందస్తు ప్లాన్ వేసింది.

విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూట్ మ్యాప్, ప్రణా...