భారతదేశం, జూన్ 21 -- అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో విశాఖపట్నం తీరాన ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ ఈవెంట్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్​ కళ్యాన్​ ఈ వేడుకకు హాజరయ్యారు.

విశాఖపట్నంలోని ఆర్​కే బీచ్​ నుంచి భోగాపురం వరకు సుమారు 26 కిలోమీటర్ల కారిడర్​లో ఈ యోగా ఈవెంట్​ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో 3లక్షలకుపైగా మంది ఏకకాలంలో యోగా చేస్తారని అంచనాలు ఉన్నాయి.

యోగాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో ప్రధాని మోదీ చేసిన కృషి గురించి తెలిసిందే. ప్రతియేటా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున వివిధ ప్రాంతాల్లో, లక్షలాది మంది ప్రజలతో కలిసి ఆయన యోగా చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈసారి విశాఖపట్నంలోని తీరం వెంబడి నిర్వహించిన ఈవెంట్​లో ఆయన పాల్గొన్నారు.

"దశాబ్దకాలంలో యో...