భారతదేశం, ఫిబ్రవరి 24 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పెళ్లి సందడి షురూ అయింది. ఈ టాలీవుడ్ వైరల్ జోడీ వెడ్డింగ్ యాక్టివిటీస్ మొదలయ్యాయి. విరోష్ పెళ్లి వేడుకలు ఊపందుకున్నాయి. ఉదయ్‌పూర్‌లో జరిగే వీళ్ల వివాహం సంబరాలు గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. రష్మిక, విజయ్ సోషల్ మీడియా పోస్టులతో వీటిపై క్లారిటీ వచ్చింది.

లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ వివాహం కోసం ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి రష్మిక, విజయ్ ఇన్ స్టాలో షేర్ చేసిన స్టోరీలు వైరల్ గా మారాయి.

స్విమ్మింగ్ పూల్ లో వాలీబాల్ ఆడుతున్న ఫొటోను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నాడు. వాలీబాల్ నెట్ నుంచి తీసిన ఆ ఫోటోలో కొంత...