భారతదేశం, ఆగస్టు 17 -- ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఎస్బీఐ) తన గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచింది. హోం లోన్​పై ఈ కొత్త రేట్లు ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చినట్టు నివేదికలు బయటకి వచ్చాయి. గృహ రుణ వడ్డీ రేట్ల పెంపుతో, అప్పు తీసుకున్న వారికి ఈఎంఐ చెల్లింపుల భారం పెరగనుంది.

తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం సాధారణ గృహ రుణం (టర్మ్ లోన్)పై వడ్డీ రేటు 7.50% నుంచి 8.70%గా ఉంది. ఇది గతంలో గరిష్టంగా ఉన్న 8.45%తో పోలిస్తే 25 బేసిస్ పాయింట్లు ఎక్కువ! అయితే, వడ్డీ రేటుకు దిగువ పరిమితిని (లోవర్ లిమిట్) మాత్రం ఎస్బీఐ మార్చలేదు.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆగస్టు 2025 ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేట్లను 5.55% వద్ద యథాతథంగా ఉంచిన తర్వాత ఎస్బీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.

ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ...