Hyderabad, ఆగస్టు 23 -- మనం ఏ పని చేసినా, మొట్టమొదట వినాయకుడిని పూజిస్తాము. ఏదైనా శుభకార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు కూడా కచ్చితంగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత మాత్రమే వాటిని మొదలు పెడతాము. అలా చేయడం వలన ఎలాంటి విఘ్నాలు లేకుండా మన పనులు పూర్తవుతాయని నమ్మకం. పెద్ద పూజలు చేసినా, యజ్ఞ యాగాలు చేసినా, మొట్టమొదట వినాయకుడిని పూజిస్తాము.

ప్రతి మాసంలో శుక్లపక్ష చవితి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. వినాయక చవితిని 9 రోజులు పాటు నిర్వహిస్తారు. వినాయకుని ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుపుతారు. పదవ రోజున ఊరేగింపుగా తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈసారి వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. వినాయక చవితి నాడు వినాయకుడిని పూజించేటప్పుడు ఈ వినాయక శ్లోకాలు చదువుకోవడం మర్చిపోకండి. నిత్యం చదువుకునే వినాయకుని శ్లోకాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. మరి ఇక వాటిపై ఒక లు...