Hyderabad, ఆగస్టు 26 -- ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించడం వలన చేపట్టే ప్రతి కార్యం కూడా ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయని నమ్మకం. అయితే వినాయక చవితి నాడు వినాయకుడిని పూజించిన తర్వాత వ్రత కథ చదువుకోవాలి. వినాయక చవితి వ్రత కథ గురించి ఈరోజు తెలుసుకుందాం.

(ముందు ఈ కథ చదివేటప్పుడు చేతిలో అక్షింతలు తీసుకుని, కథ చదివిన తర్వాత అక్షింతలను కథ పూర్తయ్యాక శిరస్సుపై వేసుకోవాలి)

చంద్రవంశానికి చెందిన ధర్మరాజు సంపదని పోగొట్టుకున్నాడు. భార్యతో, తమ్ముడుతో వనవాసం చేస్తాడు. అప్పుడు నైమిశారణ్యానికి చేరుకుంటాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక రహస్యాలను చెప్తున్న సూతమహాముని దర్శించుకుంటాడు. "రాజ్యం, సమస్త వస్తు వాహనాలని పోగొట్టుకున్నాము. ఈ కష్టాలు తీరాలంటే ఏ వ్రతం చేయాలి?" అని అడుగుతాడు. అ...