Hyderabad, ఆగస్టు 22 -- మనం చేపట్టే పనుల్లో విఘ్నాలు కలగకూడదని, మొట్టమొదట ఆదిదేవుడైనటువంటి వినాయకుడిని ఆరాధిస్తాము. ప్రతి సంవత్సరం హిందువులు వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు. వినాయకుని ఆరాధించడం వలన కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. ఆ రోజు ఐదు శుభయోగాలు ఏర్పడతాయి. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

ఆగస్టు 27న భాద్రపద శుక్ల చవితి వచ్చింది. ఆ రోజు సర్వార్ధ సిద్ది యోగం, రవి యోగం, బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం, ప్రీతి యోగం ఏర్పడతాయి. ఆ రోజున వినాయకుడిని ఆరాధించడం వలన వినాయకుడు శుభఫలితాలు ఇస్తారు. పైగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

మేష రాశి వారికి వినాయక చవితి నాడు మంచి ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి నమ్మకం కలుగుతుంది. వినాయకుడిని పూజించి ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా పూర...