Hyderabad, ఆగస్టు 25 -- ప్రతీ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. ఆ రోజున వినాయకుని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. వినాయకుడు విఘ్నాలను తొలగించి శుభ ఫలితాలను తీసుకువస్తారు. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది.

ఆయన ఆశీస్సులు లభిస్తాయి. దీంతో చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. వినాయక చవితి నాడు వినాయకుడిని పూజించేటప్పుడు, వినాయకుడిని ప్రతిష్టించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. మరి వినాయక చవితి నాడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడే తెలుసుకుందాం.

ఎప్పుడూ వినాయకుడిని ఈశాన్యం లేదా ఉత్తరం వైపు పెట్టడం మంచిది. ఈ దిశలో ఉండడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సరై...