Hyderabad, ఆగస్టు 26 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించడం వలన మన కోరికలు నెరవేరుతాయి, ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది. వినాయక చవితి నాడు వినాయకుడిని ఆరాధించినప్పుడు వినాయకుడికి ఇష్టమైన కొన్ని నైవేద్యాలను సమర్పించడం మంచిది. వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లతో పాటుగా దోసకాయను కూడా తప్పకుండా నివేదన చేయండి.

వినాయక చవితి నాడు వినాయకుడికి దోసకాయను నైవేద్యంగా పెట్టే సంప్రదాయం ఉంది. మన ఆచారం వెనుక ప్రత్యేకమైన కథ, నమ్మకాలు ఉన్నాయి. కొన్ని పురాణాల ప్రకారం చూసినట్లయితే, వినాయకుడి తల్లి పార్వతి గర్భం నుంచి కాకుండా పసుపు ముద్దతో వినాయకుడు జన్మించాడు. శిశువులు పుట్టినప్పుడు బొడ్డుతాడు కోసే ఆచారం ఉంటుంది.

వినాయకుడికి బొడ్డు తాడు లేదు. అందుకని ఆయనకు సంపూర్ణ జన్మనిచ్చినట్లుగా భావించి, దోసకా...