Hyderabad, ఆగస్టు 27 -- ప్రతి ఏటా వినాయక చవితి పండుగను భక్తులతో జరుపుతారు. వినాయక చవితి నాడు వినాయకుడి భక్తి, శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం. వినాయకుడిని పూజించడం వలన మనం చేపట్టే ఏ కార్యమైనా సరే విజయమే అని కూడా అంటారు. ఈసారి వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. వినాయక చవితి నాడు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

వినాయకుడికి గరిక అంటే ఎంతో ఇష్టం. వినాయక పూజలో కచ్చితంగా గరిక ఉండేటట్టు చూసుకోండి. వినాయకుడికి దుర్వా సమర్పిస్తే వినాయకుడు సంతోషపడి సకల సంతోషాలని అందిస్తాడు. డబ్బుకి కూడా లోటు ఉండదు. 11 గరిక పోచలు తీసుకుని పసుపు రాసి వినాయక చవితి నాడు వినాయకుడికి సమర్పించండి.

అదే విధంగా పసుపు వస్త్రంలో 11 గరిక పోచలకు పసుపు రాసి, ఆ వస్త్రంలో పెట్టి తొమ్మిది రోజులు పూజించి, నిమజ్జనం రోజు ఈ వస్త్రాన్ని ఇంట్లో డబ్బు ఉన్న చోట...