Hyderabad, ఆగస్టు 25 -- వినాయక చవితి నాడు వినాయకుడిని భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి, సంతోషంగా ఉండొచ్చు. ఎవరు, ఎప్పుడు ఏ పూజ చేసినా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తారు. వినాయకుడిని పూజించడం వలన చేసే పనిలో ఆటంకాలు ఉండవని, విజయాలే ఉంటాయని నమ్ముతారు. అందుకే శుభకార్యానికైనా, ఏ పూజకైనా, ఏ హోమాలు, వ్రతాలకైనా వినాయకుని మొట్టమొదట పూజిస్తారు.

వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం నాడు వచ్చింది. ఆ రోజు వినాయకుడిని పూజించడం వలన సంతోషంగా ఉండొచ్చు. విఘ్నాలు తొలగిపోయి విజయాలే ఉంటాయి. అయితే వినాయక చవితి నాడు కొన్ని పరిహారాలని పాటిస్తే కూడా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. మరి వినాయక చవితి నాడు వినాయకుని అనుగ్రహం కలకాలం మనపై ప్రసన్నం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయకుడికి సింధూరం అంటే ఎంతో ఇష్టం. సింధూరాన్ని వినాయకుడికి సమర్ప...