Hyderabad, ఆగస్టు 24 -- వినాయకుడిని ఆరాధించడం వలన మనం చేసే పనుల్లో ఏ ఆటంకాలు రావని చాలా మంది నమ్ముతారు. అందుకే ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదట గణపతిని పూజిస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజిస్తే అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయని నమ్మకం.

హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి నాడు వినాయక చవితి పండుగను మనం జరుపుకుంటాము. ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం నాడు వచ్చింది. ఆ రోజు నుంచి తొమ్మిది రోజులు పాటు ఘనంగా నవరాత్రులు జరుపుతారు. ఆ తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. కొన్నిచోట్ల మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు కూడా గణేష్ ఉత్సవాలను జరుపుతారు.

ఇక వినాయక చవితి నాడు వినాయకుని అనుగ్రహం కలగాలని, పూర్తి ఆశీస్సులను పొందాలని అనుకుంటే మీ రాశుల ప్రకారం ఈ విధంగా పాటించడం మంచిది. మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశ...