Hyderabad, అక్టోబర్ 3 -- మొట్టమొదట మనం ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని పూజిస్తాము. వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయని, సమస్యలు ఏమి ఉండవని అంతా నమ్ముతారు. ప్రాచీన కాలం నుంచి ఆది దంపతుల కుమారుడైనటు వంటి వినాయకుడిని మొట్టమొదట ఆర్దిస్తూ వున్నారు. వివాహం, గృహప్రవేశం వంటి వాటి నుంచి ఏ వ్రతం చేసుకున్నా వినాయకుడినే మొట్టమొదట కొలుస్తాము. వినాయకుడిని ప్రధాన దైవంగా కొలిచే ఆలయాలు మహిమాన్విత ఆలయాలుగా వెలసి నిలుస్తున్నాయి.

పిల్లలు కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. వినాయకుడికి అనేక పేర్లు వున్నాయి. ఎన్నో ఆలయాలు వున్నాయి. అయితే వినాయకుడుని చింతామణి అని ఎందుకు అంటారు. "చింతామణి" అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అభిజిత్‌ అనే మహారాజుకు ఘనుడు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను చ...