భారతదేశం, ఫిబ్రవరి 23 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు ఈ జంట గురించే మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ టాలీవుడ్ క్యూట్ కపుల్.. తమ వేడుకకు 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' (The Wedding of VIROSH) అని పేరు పెట్టారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ముందే ఈ పవర్ కపుల్ ఉమ్మడి ఆస్తుల విలువ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరగనుంది. పెళ్ళికి ముందు జరిగే హల్దీ, సంగీత్ వంటి వేడుకలు అక్కడే జరగనున్నాయి. దీనికోసం ఈ జంట ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకుంది.

ఆ తర్వాత మార్చి 4న మన హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకల స...