భారతదేశం, జూలై 27 -- విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్డమ్' (Kingdom). ఈ సినిమా మే 31న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శనివారం (జులై 26) రాత్రి కింగ్డమ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ తో ట్రైలర్ అదిరిపోయింది. ఈ ట్రైలర్ పై విజయ్ దేవరకొండ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్న రియాక్టయింది. ఆమె రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రష్మిక సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.

విజయ్ దేవరకొండ తన ఎక్స్ ఖాతాలో ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. "కింగ్డమ్ ను మా గుండెల్లో నిప్పుతో నిర్మించాం. గౌతమ్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతంతో రూపొందిన యాక్షన్ డ్రామా ఇది. ఈరోజు నేను మీకు...