Hyderabad, ఆగస్టు 18 -- టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ వారిద్దరూ తమ మధ్య బంధాన్ని ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. ఆదివారం (ఆగస్టు 17) న్యూయార్క్ నగరంలో జరిగిన 43వ ఇండియన్ డే పరేడ్‌లో వారిద్దరూ కలిసి కనిపించారు. వారి ఫోటోలు, వీడియోలు వెంటనే ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. వారి కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు.

కొన్ని రోజుల కిందటే రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఇండిపెండెన్స్ డే వేడుకల కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా పరేడ్ వీడియోలో రష్మిక, విజయ్ మాన్‌హాటన్ వీధుల్లో చేయి చేయి పట్టుకుని నడుస్తూ కనిపించారు. అయితే కెమెరాలను చూడగానే వారు వెంటనే చేతులు వదిలేసి.. వారి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు.

ఈ పరేడ్ లో వాళ్లు దగ్గరగా నిలబడిన...