భారతదేశం, జూలై 31 -- విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు మరింత మెరుగైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇకపై ఆలయ సిబ్బంది భక్తులను భక్తిపూర్వక నమస్కారంతో పాటు "జై భవానీ" అంటూ పలకరించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) వి.కె.సీనా నాయక్ అధికారికంగా ప్రకటించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు మౌలిక వసతుల మెరుగుదలపై కూడా ఆయన దృష్టి సారించారు.

ఆలయ ప్రాంగణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఈఓ సీనా నాయక్.. భక్తుల పట్ల సిబ్బంది ఎప్పుడూ అత్యంత మర్యాదగా, సహనంతో, గౌరవంగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగులు కూడా విచ్చేసే యాత్రికులను తప్పనిసరిగా "జై భవానీ" అని సంబోధించాలని ఆదేశించారు. ఈ సరికొత్త ఆచారం ఆలయ పవిత్ర వాతావరణాన్ని మరిం...