భారతదేశం, అక్టోబర్ 21 -- బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా రూట్ మార్చి, కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (DRI) అధికారులు రట్టు చేశారు. విజయవాడ శివార్లలో వ్యూహాత్మకంగా నిర్వహించిన ఆపరేషన్‌లో దాదాపు రూ. 5.84 కోట్ల విలువైన విదేశీ బంగారం, అమెరికన్ డాలర్లు, యూరోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.

బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా విదేశీ బంగారాన్ని మన దేశంలోకి అక్రమంగా తెచ్చి, కోల్‌కతా ద్వారా హైదరాబాద్‌ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విజయవాడ సమీపంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉమ్మడి ఆపరేషన్ చేపట్టారు.

విజయవాడ శివార్లలో వెళ్తున్న ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వె...