Hyderabad, అక్టోబర్ 2 -- తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో ఆరాధించి దశమి రోజు విజయదశమిని జరుపుతారు. అయితే, ఈ నవరాత్రుల్లో శమీ పూజను కూడా చేస్తారు. దేవదానువులు పాలసముద్రమును మదించినప్పుడు అమృతం వచ్చింది విజయ దశమి నాడే. శ్రవణ నక్షత్రంతో కలిసిన అశ్వయుజ దశమికి విజయ సంకేతం ఉంటుంది. కనుక విజయదశమి అని పేరు వచ్చింది. విజయ దశమి నాడు ఏ పనే మొదలు పెట్టినా కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్ముతారు.

విజయ దశమి నాడు శమీ పూజ చాలా ముఖ్యమైనది. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసానికి వెళ్లేందుకు ముందు పాండవులు ఆయుధాలను, వస్త్రాలను శమీ వృక్షంపై దాచిపెట్టారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ వృక్షాన్ని పూజించి తిరిగి ఆయుధాలను, వస్త్రాలను పొంది శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత కౌరవులపై విజయాన్ని సాధించారు.

రాముడు కూడా...