Hyderabad, సెప్టెంబర్ 12 -- ప్రతి ఒక్కరూ కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా తొలగిపోతుంది. అడ్డంకులు, సమస్యలు ఇవన్నీ కూడా వాస్తు ప్రకారం పాటించడం వలన తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తులసి మొక్కను నాటుతారు.

తులసి మొక్క ఎదుట రోజూ దీపారాధన చేసి నీటిని సమర్పిస్తారు. అయితే, పవిత్రమైన తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎంతో మేలు కలుగుతుందని అందరికీ తెలుసు. కానీ వాస్తు ప్రకారం అది ఏ దిశలో ఉండాలని విషయం చాలా మందికి తెలియదు. ఈరోజు తులసి మొక్కకి సంబంధించి కొన్ని వాస్తు నియమాలను తెలుసుకుందాం.

హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పెడతారు. తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్...