భారతదేశం, నవంబర్ 18 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు ఏమీ లేకుండా శుభ ఫలితాలను పొందవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని నిర్మించుకునే ముందు వాస్తు ప్రకారం వెంటనే నిర్మిస్తారు. ఏ దిశలో ఏముంటే మంచిది అనేది తెలుసుకుంటారు. దానిని ప్రకారం ఇల్లు కడతారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణానికి ఎంపిక చేసే స్థలంలో ఎలాంటి చెట్లు ఉండాలి, అవి ఏ వైపు ఉండాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఇంటి ఆవరణలో చెట్లు ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే కొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి. వాటిని ఇంట్లో పెంచడం వలన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా కొన్ని మొక్కల్లో ఉంటాయి.

ఔషధ గుణాలు వున్న తులసిని తూర్పు, ఉత్తరం, ఈశాన్యం వైపు పెడితే మంచిది. ఇక ఇంట్లో కొన్ని మొ...