భారతదేశం, నవంబర్ 11 -- ఇంట్లో వస్తువులను సర్దేటప్పుడు స్థలాన్ని బట్టి ఖాళీ పాత్రలు లేదా ఇతర సామాగ్రిని ఎక్కడో ఒకచోట సర్దేస్తుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రతీ మూలకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో ఎక్కువ కాలం పాటు ఖాళీ పాత్రలు ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం దెబ్బతింటుందని నమ్ముతారు.

ఇది నేరుగా కుటుంబ సభ్యుల మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఇంటి మధ్య భాగం, ఉత్తర దిశ, పూజా గది మరియు ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి అనవసరమైన వస్తువులు, ఖాళీ పాత్రలను ఉంచకూడదని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇంటికి సరిగ్గా మధ్యభాగాన్ని వాస్తు శాస్త్రంలో 'బ్రహ్మ స్థానం' అని పిలుస్తారు. ఈ ప్రాంతం మొత్తం ఇంటికి గుండెకాయ లాంటిది. ఈ స్థలాన్ని ఎప్పుడూ అత్యంత శుభ్రంగా, ఖాళీగా మరియు ఎలాంటి అడ...