భారతదేశం, నవంబర్ 4 -- చాలామంది వాస్తు ప్రకారం నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల సానుకూల శక్తి కలుగుతుందని, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. ఇంటి దిశలు, అక్కడ ఉంచే వస్తువులతో పాటు ప్రతిరోజూ చేసే అలవాట్లకు కూడా సంబంధించి వాస్తు శాస్త్రంలో చాలా నియమాలు ఉన్నాయి. అందులో భోజనానికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి.

భోజనం చేసేటప్పుడు ఏం తింటున్నాం అనేది ఎంత ముఖ్యమో, ఎక్కడ కూర్చుని తింటున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. మనం ఆహారం తినేటప్పుడు ఆ వాతావరణం మనసు, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకనే భోజనం చేసేటప్పుడు శుభ్రమైన, ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అలాగే కొన్ని ప్రదేశాల్లో కూర్చుని భోజనం చేయడం వల్ల అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ప్రధా...