భారతదేశం, డిసెంబర్ 15 -- గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) వేదికపై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ 'కాంతార' దైవాన్ని అనుకరించడం వివాదానికి దారితీసింది. దీనిపై తాజాగా 'కాంతార' స్టార్ రిషబ్ శెట్టి స్పందించాడు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దైవారాధన అనేది తమకు అత్యంత పవిత్రమైనదని, దానిని స్టేజ్ మీద ఇమిటేట్ చేయడం తనకు చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చేసిన పని తీవ్ర దుమారం రేపింది. రిషబ్ శెట్టి వారిస్తున్నా వినకుండా రణ్‌వీర్ రెండుసార్లు అలా చేయడంపై విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై తాజాగా రిషబ్ శెట్టి చెన్నైలో జరిగిన 'బిహైండ్‌వుడ్స్' ఈవెంట్‌లో మౌనం వీడాడు.

రణ్‌వీర్ పేరు ఎత్తకుండానే, దైవాన్ని ఇమిటేట్ చేయడంపై ఘాటుగా ...