భారతదేశం, ఫిబ్రవరి 12 -- టాక్సిక్ మూవీపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. యశ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏకంగా రూ.120 కోట్లకు కొన్నాడని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని అతడే ధృవీకరించడంతోపాటు అది నమ్మని వారికి తన బ్యాంకు స్టేట్‌మెంట్ పంపిస్తా అని కూడా అనడం విశేషం.

టాలీవుడ్ ప్రొడ్యూసర్ తాజాగా విక్రాంత్ లీడ్ రోల్లో నటించిన మార్కండేయ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ మిమ్మల్ని దిల్ రాజు అనాలా లేక డేర్ రాజు అనాలా అంటూ ప్రశ్న అడిగాడు. దీనికి అతడు స్పందిస్తూ.. మీ ఇష్టం.. ఎలా పిలిచినా ఓకే అని రాజు అన్నాడు.

ఆ తర్వాత టాక్సిక్ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు రూ.120 కోట్లకు కొన్నాడన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని విమర్శలు వస్...