భారతదేశం, ఆగస్టు 11 -- తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ చిత్రం వార్ 2తో బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 10) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో వార్ 2 మూవీ గురించి, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ గురించి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వెల్ ట్విస్ట్ లో మాత్రమే ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై డైరెక్టర్ అయాన్ ముఖర్జీని యాంకర్ సుమ ప్రశ్నించింది. అప్పుడు మేం చాలా స్మార్ట్ అంటూ డైరెక్టర్ ఆన్సరిచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో రెండో భాగంలో మాత్రమే ఎంట్రీ ఇవ్వడం గురించి వస్తున్న వార్తలను డైరెక్టర్ ఖండించినట్లే పేర్కొన్నాడు.

"ఇంటర్వెల్ సమయంల...