భారతదేశం, జూలై 17 -- ఆషాఢ మాసంలో ప్రతి ఏటా వారాహి నవరాత్రులను జరుపుకుంటాము. ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే అనేక విధాలుగా శుభ ఫలితాలను పొందవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. వారాహి నవరాత్రుల సమయంలో ఈ విశేషమైన దీపాలను వెలిగిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. మరి వారాహి నవరాత్రుల సమయంలో ఏ దీపాన్ని వెలిగించాలి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంద దీపాన్ని వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. ముందుగా ఒక కంద దుంపను తీసుకుని, పైభాగాన్ని కోసి, పసుపు రాసి, కుంకుమతో బొట్లు పెట్టాలి. తర్వాత ఆవు నెయ్యి వేసి, ఒత్తులు పెట్టి, ఏకహారతి లేదా అగర్బత్తితో ఈ కంద దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని ఇలా వెలిగించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి....