భారతదేశం, నవంబర్ 17 -- సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ ప్రాజెక్టు 'వారణాసి' ఫస్ట్ లుక్ ట్రైలర్‌ను శనివారం (నవంబర్ 15) రిలీజ్ చేసిన విషయం తెలుసు కదా. హైదరాబాద్‌లో 'గ్లోబ్‌ట్రాటర్' పేరుతో జరిగిన ఈవెంట్‌లో ఈ టైటిల్ ఆవిష్కరించారు. 2027లో విడుదల కానున్న ఈ మూవీని ఐమ్యాక్స్ 1.43 ఫార్మాట్లో షూట్ చేశారన్న వార్తల నేపథ్యంలో దీనిపై రాజమౌళి స్పందించాడు.

మహేష్ బాబు మూవీ వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి చేసిన ప్రకటన సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ చిత్రాన్ని 1.43:1 యాస్పెక్ట్ రేషియోలో ఐమాక్స్ (IMAX) టెక్నాలజీతో చిత్రీకరించనున్నట్లు అతడు అనౌన్స్ చేశాడు. "మేము తెలుగు సినిమాకు ఒక కొత్త సాంకేతికతను పరిచయం చేస్తున్నాము. ఇది ఐమాక్స్ కోసం షూట్ చేసిన ప్రీమియం లార్జ్ స్కేల్ ...