భారతదేశం, జనవరి 29 -- ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ వారాణాసి. గతేడాది చివర్లో ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని చెప్పినా.. కచ్చితమైన డేట్ చెప్పలేదు. కానీ తాజాగా కాశీలో కొన్ని హోర్డింగ్స్ ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానున్నట్లు చెబుతున్నాయి.

ఎస్ఎస్ఎంబీ29గా మొదలై.. తర్వాత గ్లోబ్‌ట్రాటర్ గా మారి ఫైనల్ గా వారణాసి అనే టైటిల్ సొంతం చేసుకున్న మహేష్ బాబు మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరమ పవిత్రమైన కాశీ నగరంలో ఇప్పుడీ సినిమాదే అంటూ కొన్ని హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి.

వాటిపై ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి అని రాసి ఉంది. మూవీ పేరు లేకపోయినా.. ఆ థీమ్ వారణాసి సినిమాతో మ్యాచ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఇది కచ్చితంగా ఆ మూవీదే అంటు...