భారతదేశం, డిసెంబర్ 22 -- నెట్‌ఫ్లిక్స్‌లో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' కొత్త సీజన్ ప్రారంభమైంది. మొదటి గెస్ట్‌గా వచ్చిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' (Varanasi) సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ. 1300 కోట్లు అని కపిల్ శర్మ అడగగా.. ఆమె అవునని పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'వారణాసి'. ఈ సినిమా బడ్జెట్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్న వేళ, ప్రియాంక చోప్రా 'కపిల్ శర్మ షో'లో క్లారిటీ ఇచ్చింది. ఆ షోలో జరిగిన ఆసక్తికర సంభాషణ గురించి ఇప్పుడు చూద్దాం.

ఈ షోలో కపిల్ శర్మ మాట్లాడుతూ.. "ప్రియాంక ఏం చేసినా అది భారీగానే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున...