భారతదేశం, జూలై 5 -- 'మాంగా ప్రెడిక్షన్​'తో జపాన్​ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. జులై 5న అతిపెద్ద భూకంపం సంభవిస్తుందని మాంగా ప్రెడిక్షన్​ చెప్పడంతో అందరు భయపడిపోతున్నారు. కాగా వారం రోజులుగా జపాన్​ని భూ ప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి. 1000కిపైగా భూ ప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోయారు.

జపాన్‌లోని కగోషిమా ప్రిఫెక్చర్‌లోని టోకారా దీవుల్లో గత రెండు వారాల్లో 1000కి పైగా భూకంపాలు సంభవించాయి. గురువారం (జులై 3) సంభవించిన భూకంపం ఎంత బలంగా ఉందంటే ప్రజలు నిలబడటానికి కూడా ఇబ్బంది పడ్డారు! వరుస భూకంపాల నేపథ్యంలో, జపాన్ ప్రభుత్వం ఈ మారుమూల దీవుల నివాసితులకు నైరుతి దిశలో ఉన్న సముద్ర జలాల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.

దక్షిణ జపాన్‌లోని ప్రధాన ద్వీపం క్యూషు చివరన, 5.5 తీవ్రతతో సంభవించిన భూకంపం కేంద్రానికి సమీపంలో ఉన్న దీవుల నుంచి ప్రజలన...