భారతదేశం, జూన్ 6 -- మన హిందూ సంప్రదాయం ప్రకారం చాలా విషయాలను పాటిస్తూ ఉంటాం. తెలియక చేసినా కూడా వాటి పరిణామాలను మనం కచ్చితంగా ఎదుర్కోవాలి. హిందూ సంప్రదాయంలో మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లి వంటివి కొన్ని రోజుల్లో తినడానికి నిషేధించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలో ఎప్పుడు ఉల్లి, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం తినే ఆహారం మన ఆలోచనలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఆలోచనలకు, ఆహారానికి బలమైన సంబంధం ఉంది. శాస్త్రాలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి. మనం తీసుకునే ఆహారం మన గుణాలను నిర్ణయిస్తుంది. వారంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో, కొన్ని తిథుల రోజుల్లో, పండుగ సమయాల్లో మాంసాహారం తినకూడదు. అలాగే వీలైతే ఉల్లి, వెల్లుల్లికి కూడా ఆ రోజుల్లో దూరంగా ఉండటం మంచిది. ఈ రోజుల్లో వీటిని తినడం...