భారతదేశం, ఆగస్టు 11 -- కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. వరుస హిట్లతో తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. ఇప్పుడిక 'ప్యారడైజ్' అంటూ తనలోని వేరే లెవల్ మాస్ అవతారాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. నాని అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన ప్యారడైజ్ పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నారు. ఇప్పుడు మూవీ షూటింగ్ నుంచి ఓ క్రేజీ వీడియో షేర్ చేశాడు నాని.

ప్యారడైజ్ మూవీ ఫుల్ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జడలతో నాని డిఫరెంట్ గా ఉన్నాడు. ఇప్పుడీ మూవీ నుంచి యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాని. ఈ వీడియో అదిరిపోయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎలా తెరకెక్కిస్తున్నాడో ఈ వీడియోలో క్లియర్ గా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

జైలులో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్...