భారతదేశం, జూన్ 1 -- ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. టెక్నాలజీ కూడా బాగా అభివృద్ధి చెందడంతో, దూరంగా ఉన్న వ్యక్తులతో కూడా సోషల్ మీడియా ద్వారా దగ్గరవ్వచ్చు. డిజిటల్ యుగంలో ఒక వ్యక్తిని నేరుగా కలవకముందే వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ చూసి అంచనాకు వచ్చేస్తున్నారు.

మనం పెట్టే ఫోటో అంతరాత్మకు అర్థం పడుతుందని మనస్తత్వ శాస్త్ర నిపుణులు అంటున్నారు. మనల్ని ఎలా ప్రపంచానికి మనం చూపించాలనుకుంటున్నామో డీపీ నిర్ణయిస్తుంది. అయితే చాలా మంది రకరకాల ప్రొఫైల్ పిక్చర్స్‌ను పెడుతూ ఉంటారు. అయితే దానిని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంతమంది ప్రొఫైల్ పిక్చర్ కింద గ్రూప్ ఫోటోలను పెడుతుంటారు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను పెడుతుంటారు. అలాంటి వారు ఒంటరిగా ఉండడాన...