భారతదేశం, ఆగస్టు 23 -- వాట్సాప్‌లో వచ్చిన ఒక వెడ్డింగ్​ ఇన్విటేషన్​ (పెళ్లి శుభలేఖ)ను ఓపెన్​ చేసి, ఓ ప్రభుత్వ ఉద్యోగి దాదాపు రూ. 2లక్షలు నష్టపోయాడు! మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ సైబర్ మోసం జరిగింది.

బాధితుడికి ఆగస్ట్​ 30న జరగబోయే పెళ్లికి ఆహ్వానం పంపిస్తూ గుర్తు తెలియని నంబర్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది.

"వెల్కమ్. షాదీ మే జరూర్ ఆయే (పెళ్లికి తప్పకుండా రండి). 30/08/2025. ప్రేమ అనేది సంతోషపు ద్వారాలను తెరిచే తాళం చెవి," అని ఆ మెసేజ్‌లో ఉంది. దాని కింద పెళ్లి శుభలేఖకు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ఉంది. బాధితుడు దానిని ఓపెన్​ చేశాడు.

కానీ అది పీడీఎఫ్ ఫైల్ కాదు! ఒక ఏపీకే (ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ) ఫైల్. దీనిని పెళ్లి కార్డులాగా మార్చి, వినియోగదారుల ఫోన్‌లను హ్యాక్ చేసి ముఖ్యమైన డేటాను దొంగిలించడానికి వాడారు.

బాధితుడు ఆ ఫైల్‌పై ...