భారతదేశం, మే 31 -- యూజర్స్​ని ఎంగేజ్​ చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంటుంది మెటా ఆధారిత దిగ్గజ వాట్సాప్​. ఇక ఇప్పుడు వాట్సాప్​ స్టేటస్​లను మరింత ఇంటరాక్టివ్​గా మార్చేందుకు కొత్త ఫీచర్లను జోడించింది. వీటిల్లో కొన్ని ఇన్​స్టాగ్రామ్​ తరహా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇమేజ్ లేఔట్లను జోడించే సామర్థ్యం లేదా యువర్స్ స్టిక్కర్ జోడించే సామర్థ్యం వంటి ఇన్​స్ట్రాగ్రామ్ ఫీచర్లు ఇప్పుడు వాట్సాప్​ స్టేటస్​లో కూడా ఉంటాయి.

"మీరు మీ జీవితాన్ని రూపొందించే రోజువారీ క్షణాలను పంచుకుంటున్నారా లేదా ఒక పెద్ద సందర్భాన్ని పంచుకుంటున్నారా, ఈ కొత్త ఫీచర్లు మీకు దగ్గరగా ఉన్నవారిని మరింత దగ్గరగా తీసుకురావడానికి, మీ జీవితంలో ఏమి జరుగుతుందో అప్డేట్​ చేయడానికి ఈ కొత్త ఫీచర్లు మీకు మరిన్ని మార్గాలను అందిస్తాయని మేము ఆశిస్తున్నాము," అని కొత్త ఫీచర్ల...