భారతదేశం, జూలై 26 -- ఓటీటీలో హారర్ థ్రిల్లర్ అదరగొడుతోంది. జీ5 ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. హిందీ హారర్ మూవీ 'ది భూత్నీ' (The Bhootnii) ఓటీటీలో సత్తాచాటుతోంది. థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి.. డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చింది ఈ సినిమా. హాట్ బ్యూటీ మౌనీ రాయ్, సీనియర్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఈ మూవీలో కీ రోల్స్ ప్లే చేశారు.

'ది భూత్నీ' సినిమా మే1న థియేటర్లలో రిలీజైంది. అయితే థియేటర్లలో ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. రెండు నెలల తర్వాత జులై 18న జీ5 ఓటీటీలోకి వచ్చింది ఈ హారర్ థ్రిల్లర్. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సిద్ధాంత్ సచ్ దేవ్.. మూవీ స్టోరీ కూడా రాశారు. సోహం రాక్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, త్రీ డై...