భారతదేశం, జూలై 7 -- బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ షేర్లు సోమవారం కూడా అప్పర్​ సర్క్యూట్​ని టచ్​ చేశాయి. ఈ స్టాక్​ ఇలా అప్పర్​ సర్క్యూట్​ కొట్టడం ఇది వరుసగా 19వసారి! అంతేకాదు బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ షేర్లు గత 38 ట్రేడింగ్ సెషన్​లలో 34 సార్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.

ఈ మల్టీబ్యాగర్​ స్మాల్-క్యాప్ స్టాక్ బీఎస్‌ఈలో 2% పెరిగి రూ. 35.45 వద్దకు చేరింది.

బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ అనేది ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, సైబర్‌ సెక్యూరిటీ, సురక్షిత కమ్యూనికేషన్లలో నైపుణ్యం కలిగిన గ్లోబల్ టెక్నాలజీ సంస్థ.

ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్‌లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా యూరప్‌లో తమ విస్తరణను ప్రకటించిన తర్వాత బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ షేరు ధర ఈరోజు పెరిగింది.

బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్...