భారతదేశం, ఆగస్టు 6 -- శ్రావణ మాసంలో మహిళలు శ్రావణ మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం రుపుకుంటారు. భక్త శ్రద్ధలతో ఈ వ్రతాలను ఆచరించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8న వచ్చింది. వరలక్ష్మీ వ్రతం నాడు చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వరలక్ష్మీ వ్రతం రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి. ఒకవేళ కనుక అలా కుదరకపోతే, శ్రావణమాసంలో ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు.

వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే విశేష ఫలితాలని పొందవచ్చు. అనుకున్న పనులు జరగడంతో పాటుగా, దీర్ఘసుమంగళీ యోగాన్ని కూడా పొం...