భారతదేశం, ఆగస్టు 24 -- గ్రేట్​ నోయిడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! వరకట్న వేధింపుల నేపథ్యంలో ఓ వ్యక్తి, తన భార్యకు సజీవంగానే నిప్పంటించాడు. కొడుకు ముందే ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో ఆమె భర్త, 28 ఏళ్ల విపిన్ భటిని అరెస్టు చేయగా, అతడి తండ్రి సత్యవీర్ భటి, సోదరుడు రోహిత్ భటి పరారీలో ఉన్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు.

ఈ దారుణ ఘటన ఆగస్ట్ 21న కాస్నా పోలీసు స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు నిక్కీపై కిరాతకంగా, మండే ద్రవ్యం పోసి నిప్పంటించారు. ఆమెను కొన్నేళ్లుగా రూ. 35 లక్షల వరకట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులు తెలిపారు.

నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ నుంచి దిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా ఆమె గాయాలతో మృతి చెందింది.

నిక్కీ అత్త ద...