భారతదేశం, ఆగస్టు 26 -- బాక్సాఫీస్ దగ్గర రజనీకాంత్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఆయన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కూలీ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్లు కుమ్మేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లలో రూ.500 కోట్ల మైల్ స్టోన్ రీచ్ అయింది ఈ మూవీ. దీంతో మరో రికార్డు ఈ మూవీ ఖాతాలో చేరింది.

కూలీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును అందుకుంది. 12 రోజుల్లో ఈ ఫీట్ సాధించింది. వరల్డ్ వైడ్ గా కూలీ గ్రాస్ కలెక్షన్లు రూ.500 కోట్లకు చేరాయి. తన కెరీర్ లో రజనీకాంత్ రూ.500 కోట్ల కలెక్షన్లు చేరుకోవడం ఇది మూడోసారి. రోబో 2.0, జైలర్ సినిమాలతో ఆయన ఇప్పటికే ఈ ఫీట్ సాధించాడు. కెరీర్ లో మూడు రూ.500 కోట్ల సినిమాలు అందించిన ఏకైక తమిళ యాక్టర్ తలైవానే. ఇది రజనీకాంత్ మేనియాకు నిదర్శనం. కూలీ ఇప్పటికే 2025లో అత్యధిక కలెక్షన్...