భారతదేశం, నవంబర్ 16 -- ఆర్ సిరీస్​లో కొత్త మోడల్‌ను త్వరలోనే లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది వన్‌ప్లస్ సంస్థ. ఈ స్మార్ట్​ఫోన్​ పేరు​ వన్‌ప్లస్ 15ఆర్​. గత కొన్ని వారాలుగా, ఈ కొత్త స్మార్ట్‌ఫోన్​పై అనేక రూమర్స్​, లీక్స్​ వెలువడుతున్నాయి. దీని ద్వారా ఈ గ్యాడ్జెట్​ నుంచి మనం ఏం ఆశించవచ్చో ముందే తెలుస్తోంది! అందువల్ల, రాబోయే వన్‌ప్లస్ 15ఆర్ 5జీలోని అప్‌గ్రేడ్‌లను బాగా అర్థం చేసుకోవడానికి, దాని మునుపటి మోడల్ వన్‌ప్లస్ 13ఆర్ 5జీతో పోల్చాము. ఇది కొనుగోలు చేయదగినదేనా అని ఇక్కడ తెలుసుకుందాము.

వన్‌ప్లస్ 15ఆర్ 5జీ : డిజైన్ పరంగా, వన్‌ప్లస్ 13ఆర్ వృత్తాకార కెమెరా మాడ్యూల్‌కు బదులుగా, 15ఆర్​లో సరికొత్త కెమెరా మాడ్యూల్‌ ఉంటుందని భావిస్తున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఉంచేందుకు ఇందులో చదరపు ఆకారంలోని కెమెరా ఐలాండ్‌ను ఆశించవచ్చు. అదనంగా, వన్‌ప్లస్ 15ఆ...